విషయం బయటకు రావడంతో పాక్ అధికారుల దిద్దుబాటు చర్యలు

విషయం బయటకు రావడంతో పాక్ అధికారుల దిద్దుబాటు చర్యలు

పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం ఉందంటే అవును అనలేము.. కాదనీ అనలేము. ఎందుకంటే అక్కడ పాలకుల కంటే పాక్ సైన్యమే ఫవర్ పుల్ అనేది జగమెరిగిన సత్యం. ఒక రకంగా చెప్పాలంటే పాక్ సైన్యం కనుసన్నల్లోనే పాలకులు మెలుగుతారంటే అతిశయోక్తికాదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం పాక్ ఆర్మీచీఫ్ ఖమర్ జావేద్ బజ్వా.. దేశంలోని ముఖ్య పారిశ్రామిక వేత్తలతో సమావేశం కావడమే. దేశంలోని ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన వారితో సమావేశమయ్యారట. అంటే అన్నిదేశాల్లోలాగా విత్త మంత్రి, ఆర్ధికవేత్తలు, ప్రణాళిక సంఘం సభ్యులు ఇక్కడ ఏ మాత్రం పనిచేయరు. అదే పాక్ ప్రత్యేకత.

ఆర్ధిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ఏకంగా పాక్ ఆర్మీ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా పాక్ ఆర్మీచీఫ్ పాక్ ఆర్ధిక రాజధాని కరాచీ, రావల్పిండిలలో పారిశ్రామిక వేత్తలతో ఖమర్ జావేద్ సమావేశమయ్యారు. ఆర్ధిక మందగమనానికి తీసుకోవాల్సిన చర్యలు, పెట్టుబడులు ఆకర్శించేందుకు ఏమిచేయాలనే దానిపై పారిశ్రామిక వేత్తల సలహాలు ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ సమవేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయన ప్రభుత్వ అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలిసింది.

పాకిస్థాన్ లో ఎప్పుడు స్థిరమైన ప్రభుత్వం లేకపోవడం. ప్రభుత్వం పై సైన్యం తిరుగుబాటు చేయడం. ఉగ్రవాద సంస్థలు పెట్రేగి పోవడంతో పాక్ లో ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్థమైంది. ఈ పరిస్థితుల్లో సరైన నాయకుడు లేకపోవడంతో ఇప్పుడు ఏకంగా సైన్యమే ఆర్ధిక వ్యవహారాలు చూడాల్సివస్తోంది. అయితే ఆర్ధిక వ్యవహారాల్లో సైన్యం జోక్యాన్ని ఆదేశ ఆర్ధికవేత్తలు, వ్యాపారులు సైతం స్వాగతించడం విశేషం. ఇంతవరకు భాగానే ఉంది.... కానీ ఇందులో సైన్యం పాత్ర మితిమీరితే పరిస్థితి ఏమిటని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం కాస్తా బయటకు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు.

దేశంలో ఆర్దికవ్యవహారాలను సైన్యం ప్రభావితం చేస్తున్నారన్న వార్తలను పాక్ ఆర్ధిక శాఖ ప్రతినిధి ఒమర్ హామీద్ ఖాన్ ఖండించారు. ఇందులో ఎవరి జోక్యం లేదని, ప్రభుత్వమే తగు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అయితే ఆర్ధిక వ్యవహారాల్లో సైన్యం జోక్యం పెరుగడం ప్రజాస్వామ్యానికే ప్రమాదంగా భావిస్తున్నారు ఆర్ధిక నిపుణులు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందోనని దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, ఆర్ధిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story