త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న టాలీవుడ్ హీరోయిన్

అందం, అభినయం కలబోసుకున్న అర్చన (వేద) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. తనను మెచ్చిన తనకు నచ్చిన వరుడు జగదీశ్‌ను వివాహం చేసుకోబోతోంది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. త్వరలోనే శుభవార్త చెబుతానంటూ ఆ మధ్య అర్చన అభిమానులకు హింట్ ఇచ్చింది. వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో అర్చన నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై అర్చన-జగదీశ్‌లకు శుభాకాంక్షలు అందజేశారు. బిగ్‌బాస్ సీజన్1 అర్చనతో పాటు పాల్గొన్న శివ బాలాజీ, నవదీప్‌లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. కన్నడ, మళయాళం, తమిళ సినిమాల్లోనూ నటించింది. మంచి డ్యాన్సర్ అయిన అర్చన సినిమాల్లో హీరోయిన్‌గా రాణించలేకపోయింది. పలు డ్యాన్స్‌షో లకు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com