అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులు..

అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులు..

అక్టోబర్ నెలలో బ్యాంకులకు అత్యధిక సెలవులు ఉన్నాయి. శని ఆది వారాలకు తోడు దసరా, దీపావళితో పాటు మరికొన్ని ప్రత్యకమైన రోజులు ఈ నెలలోనే ఉండడంతో దాదాపు పది రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇప్పటికే గాంధీ జయంతికి బ్యాంకుకు సెలవు వచ్చింది. ఇక అక్టోబర్ 6 ఆదివారం, 7 మహార్నవమి, 8 దసరా, 12 రెండో శనివారం, 13 ఆదివారం, 20 ఆదివారం, 26 నాలుగో శనివారం, 27 దీపావళి, 28 గోవర్దన్ పూజ, 29 భాయ్ దూజ్ (యమ విదియ). 26,27,28 వరుసగా సెలవులు వస్తున్నాయి. కాబట్టి బ్యాంకు పనులు ఏమైనా ఉంటే ముందే జాగ్రత్త పడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సెలవులు అన్ని ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు వర్తిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story