బంగారం ధర పెరిగింది.. వెండి ధర తగ్గింది.. 10 గ్రాముల బంగారం..

బంగారం ధర పెరిగింది.. వెండి ధర తగ్గింది.. 10 గ్రాముల బంగారం..
X

బంగారం ధర మరికొంత తగ్గితే అప్పుడు కొనుక్కోవచ్చులే అని కొనుగోళ్లను వాయిదా వేసుకున్న కస్టమర్లకు నిరాశే ఎదురైంది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.910 పెరుగుదలతో రూ.39,580కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.910 పెరుగుదలతో రూ.36,360కు చేరుకుంది. బంగారం ధర ఇలా ఉంటే వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,350 తగ్గుదలతో 45,750కు దిగివచ్చింది. అనుకున్నంతగా డిమాండ్ లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర 24 క్యారెట్లున్న 10 గ్రాముల ధర 38,950 ఉంటే, 22 క్యారెట్ల ధర 37,150కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 1,513.65 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.07 శాతం క్షీణతతో 17.66 డాలర్లకు తగ్గింది.

Next Story

RELATED STORIES