హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. మళ్లీ అవే గుర్తులతో గులాబీ శ్రేణుల్లో టెన్షన్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. మళ్లీ అవే గుర్తులతో గులాబీ శ్రేణుల్లో టెన్షన్

రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ హిట్ పెంచేసింది హుజూర్ నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక. అభ్యర్ధులకు కేటాయించిన ఎన్నికల గుర్తుల వ్యవహారం మరింత సెగ రాజేసింది. గతంలో ఎన్నికల గుర్తులే కొందరి భవిష్యత్తును తారమారు చేశాయి. ముఖ్యంగా అధికారపార్టీ అయిన TRS ఓట్లు తగ్గడానికి కారణమయ్యాయి. ఇది కొన్నిచోట్ల అభ్యర్ధుల పరాజయానికి కారణమయ్యాయని TRS వర్గాలంటాయి. రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు తమ పార్టీని వెంటాడుతున్నాయని అంటున్నారు. అచ్చం కారు గుర్తులాగే ఉండి.. తమ ఓట్లకు గండికొట్టాయని గతంలో టిఆర్ఎస్ ఆరోపించింది. మరోసారి అదే వ్యవహారం మళ్లీ హుజూర్ నగర్ లో చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం ఉప ఎన్నికల బరిలో.. నామినేషన్లు ముగ్గురు ఉపసంహరించుకున్నారు. మిగతా 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 24 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఈవీఎంలో బిజెపి అభ్యర్థి కోట రామారావు, రెండో స్థానంలో టీడీపీ అభ్యర్ధి చావా కిరణ్మయి, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఉత్తమ్ పద్మావతి ఉన్నారు. నాలుగో స్థానంలో TRS అభ్యర్థి సైదిరెడ్డి ఉన్నారు. ఇంతవరకు భాగానే ఉన్నా.. ఐదో స్థానంలో ఉన్న మహేష్ అనే అభ్యర్ధికి ట్రాక్టర్ గుర్తు కేటాయించారు. ఈవీఎంలో ఆరో పేరుగా ఉన్న కిరణ్ అనే స్వతంత్ర అభ్యర్ధికి రోడ్ రోలర్ గుర్తు వచ్చింది. దీంతో TRS గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ట్రాక్టర్, రోలర్, ఆటోల విషయంలో ఓటర్లు ఏమాత్రం కన్ ఫ్యూజ్ అయినా.. సైదిరెడ్డి జయాపజయాలపై ప్రభావం పడుతుందని భయపడుతున్నారు TRS నాయకులు.

గత ఎన్నికల్లో రోడ్ రోలర్, ట్రాక్టర్, ఆటో గుర్తులు కేటాయించడం వల్ల తమ ఓట్లు భారీగా తగ్గాయని TRS ఆరోపించింది. ట్రాక్టర్, రోడ్ రోలర్, ఆటో గుర్తులు ఇంచుమించు కారును పోలిఉండడంతో టీఆర్ఎస్ కారు అనుకుని వాటికే ఓట్లు వేశారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది పార్టీ. అంతేకాదు తమ కారు గుర్తు కూడా మరింత ముదురు రంగుతో క్లియర్ గా కనిపించేలా ఈవీఎంలో పెట్టాలని ఎన్నికల సంఘానికి గత ఏడాది మాజీ ఎంపీ వినోద్ వినతిపత్రం ఇచ్చారు. దీంతో కారు గుర్తు మార్చింది ఎన్నికల సంఘం. కానీ రోడ్ రోలర్, ట్రాక్టర్, ఆటో గుర్తులు మాత్రం స్వతంత్ర అభ్యర్ధులకు ఇవ్వకుండా ఉండలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో మరోసారి హుజూర్ నగర్‌లో భారీగా నామినేషన్లు పడడంతో అనివార్యంగా ఎన్నికల సంఘం ట్రాక్టర్, రోడ్ రోలర్, ఆటో గుర్తులు స్వతంత్రం అభ్యర్ధులకు కేటాయించింది. దీంతో TRS పార్టీలో కలవరం మొదలైంది.

Tags

Read MoreRead Less
Next Story