అద్భుతంగా పోరాడిన సౌతాఫ్రికా.. ప్రభావం చూపని పేసర్లు

అద్భుతంగా పోరాడిన సౌతాఫ్రికా.. ప్రభావం చూపని పేసర్లు

విశాఖ టెస్టులో సౌతాఫ్రికా పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 385 రన్స్ చేసింది.. ఇండియా కంటే ఇంకా 117 రన్స్ మాత్రమే వెనుకబడి ఉంది. 3 వికెట్ల నష్టానికి 39 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ అద్భుతంగా పోరాడారు. ఇండియన్ స్పినర్లను కాచుకొని క్రీజులో పాతుకుపోయారు...ఓపెనర్ ఎల్గర్ సెంచరీతో చెలరేగాడు.. అటు కెప్టెన్ డుప్లెసిస్‌ కూడా అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఎల్గర్-డుప్లెసిస్ జోడీ ఐదో వికెట్‌కు 115 పరుగులు జోడించింది. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్.. డికాక్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించాడు. ఎల్గర్‌తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించారు..ఈ క్రమంలోనే సెంచరీ పూర్తిచేశాడు..

బౌలింగ్‌లో మన పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేదు.. ఇశాంత్ శర్మ మాత్రమే ఒక వికెట్ తీశాడు. స్పిన్నర్లు ఎప్పటిలాగే బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. రవిచంద్రన్ అశ్విన్‌ మరోసారి 5 వికెట్లు తీశాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశాడు.. దీంతో టెస్టులో 200 వికెట్ల క్లబ్‌లో చేరారు జడేజా.

Tags

Read MoreRead Less
Next Story