పాకిస్థాన్‌ వెళ్లనున్న మాజీ ప్రధాని మన్మోహన్

పాకిస్థాన్‌ వెళ్లనున్న మాజీ ప్రధాని మన్మోహన్
X

పాకిస్థాన్‌ వెళ్లనున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని పాక్ లోని కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్‌ సాహిబ్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయనను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ ఆహ్వానించడంతో వెళ్లేందుకు మన్మోహన్అంగీకరించారని తెలుస్తోంది..మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా వ్యవహరించిన పదేళ్లలో ఎన్నడూ పాకిస్తాన్‌ను సందర్శించలేదు. పాకిస్తాన్‌ పంజాబ్‌ ప్రావియన్స్‌లోని గా ప్రాంతంలో మన్మోహన్‌ జన్మించగా దేశ విభజన అనంతరం వారి కుటుంబం అమృత్‌సర్‌కు తరలివచ్చింది.

నవంబర్ 12న గురునానక్ జయంతి. మన్మోహన్ సింగ్ నవంబర్ 9న కర్తార్‌పూర్ గురుద్వారాకు తొలి విడత భక్తులతో కలసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మన్మోహన్ సుల్తాన్‌పూర్ లోధికి కూడా వెళ్తారు. ఇప్పటికే పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఖురేషీ,కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్ ను ఆహ్వానించనున్నాం అని తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీని విస్మరిస్తూ కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించాలని పాక్‌ నిర్ణయించింది.

పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్‌ను.. పంజాబ్‌లోని గురునానక్ మందిరాన్ని కర్తార్‌పూర్ కారిడార్ కలుపుతోంది. రావి నది ఒడ్డున ఉన్న ఈ గురుద్వారాను సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. సిక్కుల మత గురువు గురునానక్ తన జీవితంలోని చివరి 18 ఏళ్లు ఇక్కడే గడిపారని ఆ మత పురాణాల ద్వారా తెలిసింది. అందుకే ఈ గురుద్వారాకు అంత ప్రాముఖ్యం ఉంది. అయితే విభజనతో ఈ ప్రాంతం పాక్ భూభాగంలో కలవడంతో భారత్ లోని సిక్కులు ఈ క్షేత్రాన్ని చేరుకోవాలంటే ఇబ్బందులు పడేవారు. ఈ కారిడార్ ప్రారంభమైతే పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా నుంచి పాక్ భూభాగంలోకి డేరాబాబా నానక్‌కు భారత్ నుంచి యాత్రికులు వెళ్లొచ్చు.

Next Story

RELATED STORIES