తమన్నాకి ఉపాసన సర్‌ఫ్రైజ్ గిప్ట్

తమన్నాకి ఉపాసన సర్‌ఫ్రైజ్ గిప్ట్
X

దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా. విడుదలైన ప్రతి చోటా ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. రాంచరణ్ నిర్మాతగా అతడిని మరో మెట్టు పైన నిలిపింది ఈ చిత్రం. చారిత్రక చిత్రం ఇంత మంచి విజయం సాధించడంతో చిరంజీవి చాలా సంతోషంగా ఉన్నారు. చిత్రబృందం ఈ విజయంతో మరింత ఉత్సాహంగా ఉన్నారు. రాంచరణ్ భార్య ఉపాసన చిత్ర విజయంలో పాలు పంచుకున్న తమన్నాకి.. సర్‌ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చింది. ఖరీదైన ఉంగరాన్ని తమన్నాకి బహుమతిగా అందించింది. ఉపాసన ఇచ్చిన ఉంగరాన్ని ధరించిన తమన్న ట్విట్టర్‌లో ఫోటోని షేర్ చేసింది. చరణ్ భార్య నుంచి తమన్నాకు ఓ బహుమతి. నిన్ను మిస్ అవుతున్నాను. త్వరలో కలుద్దాం అని ఉపాసన ట్వీట్ చేశారు. నర్సింహారెడ్డి ప్రియురాలిగా, నర్తకిగా తమన్నా తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Next Story

RELATED STORIES