ప్రేమలో పడ్డ అఖిల్ భామ.. అతడితోనే..

ప్రేమలో పడ్డ అఖిల్ భామ.. అతడితోనే..
X

ప్రముఖ తమిళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్, అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో చిత్రంలో నటించింది. సాయిధరమ్ తేజతో చిత్రలహరి సినిమాలో మరోసారి కనిపించింది. ఇదిలా ఉండగా కళ్యాణి మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్‌తో కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారట. ఈ విషయంపై కళ్యాణి స్పందిస్తూ.. ప్రేమ, డేటింగ్ మాట నిజమే కానీ.. అతను ఎవరనేది మాత్రం చెప్పను. అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి.. పెద్దల నుంచి మాకు ఇబ్బందులు తలెత్తవని అనుకుంటున్నాను అని అంది. మీరనుకున్నట్లు అతడు ప్రణవ్ కాదు. అతడు నాకు సోదరుడిలాంటి వాడు. అతనితో డేటింగ్ అన్న వార్తలు విని నవ్వుకున్నాను. సమయం వచ్చినప్పుడు నేనే అతని గురించి చెప్తాను అని వివరించింది కళ్యాణి. ప్రస్తుతం కళ్యాణి తమిళంలో శివ కార్తికేయన్‌కు జోడీగా చేస్తోంది. తండ్రి ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

Next Story

RELATED STORIES