బాలికపై అఘాయిత్యం చేసి.. రాళ్లతో..

బాలికపై అఘాయిత్యం చేసి.. రాళ్లతో..
X

చిన్నారులపై దారుణాలు ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో చోట అమాయక బాలికలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు మృగాళ్లు. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. బహిర్బూమికి వెళ్లిన 9 ఏళ్ల బాలికపై ఓ గుర్తు తెలియని దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం రాళ్లతో తలపై కొట్టి హత్యాయత్నం చేశాడు. అయితే బాలిక అరుపులు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే.. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. బాధిత బాలికను ఆస్పత్రికి తరలించారు. అపాస్మరక స్థితిలోకి వెళ్లిన బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Next Story

RELATED STORIES