ఆరు దాటితే..ఆర్టీసీ ఉద్యోగులు కారు..అర్హత కలిగిన వారికి ఆర్టీసీలో..

ఆరు దాటితే..ఆర్టీసీ ఉద్యోగులు కారు..అర్హత కలిగిన వారికి ఆర్టీసీలో..

ఆర్టీసీ సమ్మెపై కార్మికులకు మరోసారి ప్రభుత్వం వార్నింగ్‌ ఇచ్చింది.. సాయంత్రం ఆరు గంటల్లోగా కార్మికులు విధుల్లో చేరాల్సిందేనని మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు.. ఆరు గంటల్లోపు విధుల్లో చేరకుంటే ఉద్యోగులుగా పరిగణించబోమని చెప్పారు. భవిష్యత్తులోనూ వారిని ఉద్యోగులుగా సంస్థ గుర్తించదని మరోసారి స్పష్టం చేశారు..

అలాగే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.. అదే సమయంలో ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.. మూడు నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకొని నడపడం ఒక ఆలోచన కాగా.. ఆర్టీసీ బస్సులు నడిపేందుకు డ్రైవింగ్‌ లెసెన్సు కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం రెండో ఆలోచనగా కనబడుతోంది.. వారికి శిక్షణ ఇచ్చి బస్సులను యథావిధిగా నడపాలనుకుంటోంది. లేదంటే ఆరు నుంచి ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్‌ పర్మిట్లు ఇవ్వాలని భావిస్తోంది.. ఆదివారం ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌.. ఈ సమీక్షలో ప్రత్యామ్నాయ విధానాన్ని ఖరారు చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story