ప్రభుత్వం వార్నింగ్ కు వెనక్కు తగ్గని ఆర్టీసీ కార్మికులు..

ప్రభుత్వం వార్నింగ్ కు వెనక్కు తగ్గని ఆర్టీసీ కార్మికులు..

ప్రభుత్వం పెట్టిన డెడ్‌ లైన్‌ ముగిసింది.. ఉద్యోగాలు పోతాయని వార్నింగ్‌ ఇచ్చినా ఆర్టీసీ కార్మికులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.. ప్రభుత్వ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా బంద్‌ కొనసాగిస్తున్నారు.. సాయంత్రం ఆరు గంటల్లోగా కార్మికులు రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించినా లైట్‌ తీసుకున్నారు.. ఇప్పటి వరకు ఎవరూ రిపోర్ట్ చేయలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.. మరోవైపు ప్రభుత్వ చర్యలపై కార్మికుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.. అటు రేపటి నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని కార్మిక సంఘ నేతలు చెబుతున్నారు.. ఆదివారం అన్ని డిపోల ఎదుట బతుకమ్మ ఆటలతో నిరసనలు తెలుపనున్నారు.. సోమవారం ఇందిరాపార్క్‌ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story