ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు - డిపో మేనేజర్‌

ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు - డిపో మేనేజర్‌

ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హైద్రాబాద్‌ హయత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న 6 డిపోలలో 923 బస్సులు నిలిచిపోయినట్టు డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తాత్కాలిక డ్రైవర్స్, కండక్టర్లని పెట్టి బస్సులను నడిపే ఆలోచనలో ఉన్నట్టు తెలియజేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story