తాజా వార్తలు

గాంధీ ఆస్పత్రికి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ తరలింపు

గాంధీ ఆస్పత్రికి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ తరలింపు
X

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. అక్కడ వైద్య పరీక్షల తర్వాత జడ్జిముందు ప్రవేశపెట్టనున్నారు.అసోసియేటెడ్ బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్ నుంచి...నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వాడుకున్నారన్నది రవిప్రకాశ్‌పై ఉన్న ప్రధాన అభియోగం.18 కోట్ల నిధులను రవిప్రకాశ్‌ అండ్ టీమ్ అక్రమంగా మళ్లించిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది అలందా మీడియా . సంస్థ నిధులు, లాభాలను భారీగా పక్కదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యాజమాన్యం నమ్మకాన్ని వమ్ముచేశారని చెప్పారు. ఈ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌తో పాటు ABCL మాజీ సీఎఫ్‌వో మూర్తిని కూడా బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రవిప్రకాశ్‌ను పలు అంశాలపై ప్రశ్నించారు పోలీసులు. అటు ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. రవిప్రకాశ్‌ను కస్టడీకి తీసుకుంటామని డీసీపీ సుమతి చెప్పారు.

షేర్‌ హోల్డర్లు, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండానే రవిప్రకాశ్‌ బృందం...భారీ మొత్తంలో కంపెనీ నగదును విత్‌ డ్రా చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమకు తాము భారీగా బోనస్‌లు కూడా ప్రకటించుకున్నారు. ABCL కంపెనీని టేకోవర్‌ చేసిన అలందా మీడియా డైరెక్టర్లు ఈ ఏడాది సెప్టెంబర్‌ 24న సమావేశమై పక్కదారి పట్టిన నిధులపై బోర్డులో చర్చించారు. అనంతరం రవిప్రకాశ్‌ అండ్‌ కోపై క్రిమినల్‌ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు..

సెప్టెంబర్‌ 2018 నుంచి... 8 మే 2019 వరకు నిధుల మళ్లింపు జరిగినట్లు అలంద మీడియా ఫిర్యాదులో పేర్కొంది. లాభాలను టీవీ9 లోగో విక్రయం, విధులకు ఆటంకం కలిగించాన్న ఆరోపణలతో రవిప్రకాష్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES