తాజా వార్తలు

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక.. మరోసారి 19లక్షల స్వాధీనం

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక.. మరోసారి 19లక్షల స్వాధీనం
X

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో ప్రలోభాలకు తెరలేచ్చే ఉద్దేశంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నియోజకవర్గంలో తనిఖీ చేస్తు డబ్బు, మద్యం సరఫరాపై గట్టి నిఘా పెట్టారు. అందులో భాగంగా సూర్యాపేట సమీపంలోని కొర్లపాడ్‌ టోల్‌గేట్‌ వద్ద పోలీసులు రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. సోదాల్లో కారులో డబ్బు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 19లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదును సీజ్‌ చేశారు. డబ్బు ఎవరిది.. ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES