ట్విస్ట్ : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌

ట్విస్ట్ : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌

TSRTC సమ్మె వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. కార్మికుల సమ్మెతో బస్సులు ఎక్కడికక్కడ డిపోల్లో నిలిచిపోయాయి. దీంతో పండుగ వేళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ అరకొర ఏర్పాట్లు ఎటూ సరిపోవడంలేదు. అటు ప్రయివేటు ఆపరేటర్లు రెండు మూడింతలు వసూలు చేస్తూ ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు.

ఆర్టీసీ సమ్మెపై కాసేపట్లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రగతిభవన్‌లో ఈ సమీక్షా సమావేశం జరగనుంది. కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి రవాఖాశాఖ, పోలీసు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. ప్రజల సమస్యలను దృష్టిలోపెట్టుకుని సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని పిల్‌ వేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని పిటిషనర్‌ కోరారు. హోస్‌ మోషన్‌ పిటిషన్‌పై సాయంత్రం 4 గంటలకు హైకోర్టు విచారించనుంది.

Tags

Read MoreRead Less
Next Story