కశ్మీర్‌లో ఆపరేషన్ గాందర్బల్.. 10 రోజులుగా హెలికాఫ్టర్..

కశ్మీర్‌లో ఆపరేషన్ గాందర్బల్.. 10 రోజులుగా హెలికాఫ్టర్..
X

కశ్మీర్ లో భద్రతా దళాలు పెద్ద ఆపరేషన్‌కు తెరతీశాయి. ఇక్కడి గాందర్బల్ అడువుల్లోకి అత్యున్నత బలగాలను హెలికాఫ్టర్ల ద్వారా తరలిస్తున్నాయి. పదిరోజులుగా ఈ వ్యవహారం సీక్రెట్‌గా నడుస్తోంది. ఇటీవల ఈ అడవుల్లో ఇద్దరు టెర్రరిస్టులను ఎన్‌కౌంటర్ చేశారు. అప్పటి నుంచి కూబింగ్ మరింత ముమ్మరం చేశారు. ఇక్కడి వెళ్లడానికి ఎలాంటి రోడ్లు లేవు. దీంతో సైన్యాన్ని వేగంగా అక్కడకు చేర్చేందుకు ఎయిర్ లిఫ్ట్ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇటీవల గాందర్బల్ అడవుల్లో పహారా కాస్తున్న మన ఆర్మీకి భారీ టెర్రరిస్టు గ్రూప్ ఒకటి కనిపించింది. ఈ ముష్కర మూక పాకిస్తాన్ నుంచి ఈ అడవుల్లోకి ప్రవేశించి ఉంటుందని అనుమానిస్తున్నారు.

గాందర్బల్ పర్వాతాలు అడవులతో నిండిన దుర్భేద్యమైన ప్రదేశం. ఉగ్రవాదులు ప్రవేశించిన గురేజ్-గాందర్బల్ మధ్య ఒక మంచి నీటి సరస్సు ఉంది. శ్రీనగర్ చుట్టుపక్కల ప్రాంతాలను ఈ పర్వతాలు కలుపుతుంటాయి.ఇక్కడ కొండలను ఎక్కి ప్రయాణిస్తే 7 గంటల్లో త్రాల్ ను చేరుకోవచ్చు. ఉగ్రవాదులకు ఇది తొలి మజిలీ.

కొన్ని రోజుల క్రితం ఈ గాందర్బల్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను తెచ్చేందుకు సైన్యానికి, స్థానికులకే దాదాపు ఒక రోజు పట్టింది. మృతుల్లో ఒకరైన కమర్ ఉద్దీన్ గత ఏడాది ఏప్రిల్ లో నేపాల్ వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వాఘా సరిహద్దు నుంచి పాక్ కు వెళ్లినట్లు గుర్తించారు. ఉత్తర కశ్మీర్ కు చెందిన ఈ యువకుడు ఉగ్రవాదిగా మారి బోర్డర్ దాటివచ్చాడు. ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇంటర్నెట్, మొబైల్ సేవలు అందుబాటులో లేని మారుమూల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్.. వివరాలు వెంటనే ఆ టెర్రరిస్టు కుటుంబానికి తెలిసిపోయింది. ఈ ఘటన సైన్యాన్ని సైత్యం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గాందర్బల్ అడవుల్లోకి పెద్ద ఎత్తున టెర్రరిస్టులు చొరబడ్డారని అనుమానిస్తోంది సైన్యం. అందుకే ఏరివేతపై ఫోకస్ చేస్తోంది. కాలినడకన ఇక్కడి చేరుకోవడం కష్టం కనుక.. హెలికాఫ్టర్ల ద్వారా సైన్యాన్ని తరలిస్తోంది. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించి సైన్యం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

Next Story

RELATED STORIES