ఆస్తి కోసం అందర్నీ వరుసగా.. 14 సంవత్సరాల్లో ఆరుగురిని..

ఆస్తి కోసం అందర్నీ వరుసగా.. 14 సంవత్సరాల్లో ఆరుగురిని..
X

ఆస్తి కోసం అత్తింటి వారందరినీ మట్టు పెట్టింది. ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా గుండె పోటుతో మరణించారంటూ కథలల్లేది. చేసిన పాపం మరెంతో కాలం దాగలేదు. సంపన్న కుటుంబానికి చెందినా ఆస్తి ఎవరికీ దక్కకూడదు. తనకి మాత్రమే చెందాలన్న స్వార్థం. అరుగురిని హత్య చేయడానికి పురిగొల్పింది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో పున్నమట్టోంది ఒక సంపన్న కుటుంబం. 2002 నుంచి 2016 వరకు ఆ ఇంటికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఒకే రీతిలో హత్యకు గురయ్యారు. 17 ఏళ్ల పాటు ఎవరికీ హత్యలపై అనుమానం రాలేదు. ఇన్నిహత్యలు చేసిన తరువాత కాని వదిన జాలీ మీద మరిదికి అనుమానం వచ్చింది.

జాలీ మామ టామ్ థామస్ చనిపోతే ఆస్తి అంతా అత్తగారి వశమవుతుందని భావించిన జాలీ అత్తగారు అన్నమ్మథామస్‌కు పెట్టే అన్నంలో సైనెడ్ కలిపి 2002లో హత్య చేసింది. అది తిన్న వెంటనే ఆమె కుప్పకూలి మరణించింది. ఆ తరువాత ఆరేళ్లకు మామగారు టామ్ థామస్‌కూ సైనేడ్ ఇవ్వడంతో ఆయనా మరణించారు. ఆయనది కూడా గుండె పోటే అనుకున్నారు అంతా. భర్త తన స్నేహాలను ప్రశ్నిస్తున్నాడని.. తనతో సరిగా ఉండడట్లేదని ఆయన్నీ 2011లో సైనేడ్ ఇచ్చి చంపేసింది. శవ పరీక్షలో అతడి మృతికి విషం కారణమని తేలినప్పటికీ గుండె పోటు వచ్చి మరణించినట్లు వాదించింది. తనని పదే పదే ప్రశ్నించి కేసు పక్కదారి పట్టిస్తున్నాడని అత్తగారి సోదరుడైన మాథ్యా మన్‌జదియల్‌కి 2014లో సైనేడ్ ఇచ్చి చంపేసింది. 2016లో చిన మామగారి కొడుకు రెండేళ్ల కూతురు అనుమానాస్పద స్థితిలో మరణించింది. పాప మరణించిన కొద్ది నెలలకే పాప తల్లి కూడా చనిపోయింది. ఇదిలా ఉండగా ఆడపడుచు రెజీకి కూడా విషపదార్థం కలిపి ఇచ్చింది. అయితే ఆమె అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. వదినే హత్యలకు కారణమని తెలుసుకున్నా కుటుంబ పరువు పోతుందని బయటకు చెప్పలేదు ఆమె. జాలీ తల్లిదండ్రులు కూడా కుమార్తె చేస్తున్న హత్యల గురించి తెలియదన్నారు.

ఈ క్రమంలో మరణించిన పాప తండ్రిని జాలీ రెండో వివాహం చేసుకుంది. వీలునామా ప్రకారం ఆస్తిని తనకు అప్పగించాలని జాలీ వాదన మొదలు పెట్టింది. దీంతో అమెరికాలో ఉన్న మరిది మోజోకు వదిన మీద అనుమానం వచ్చింది. కుటుంబంలోని మరణాల వెనుక ఏదో మిస్టరీ ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. జాలీ చేసిన హత్యలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూసాయి. సమాధులను తవ్వితీసి పరీక్షలు నిర్వహించగా మృతదేహాల్లో సైనైడ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. పాలిగ్రాఫ్ పరీక్ష చేయించుకోవలసిందిగా అధికారులు అడగితే ఆరోగ్యం బాగాలేదని జాలీ తిరస్కరించింది. పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES