దేశవ్యాప్తంగా బాణం వేసి రావణ దహనం

దేశవ్యాప్తంగా బాణం వేసి రావణ దహనం
X

జమ్ము నుంచి కన్యాకుమారి వరకు దసరా వేడుకలు అంబరాన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక భవనాలన్ని డెరేషన్ లైటింగ్ లో అందంగా ముస్తాబయ్యాయి. ఇక ఢిల్లీలోని ద్వారక మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.. బాణం వేసి రావణ దహనం చేశారు. రావణ వథను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు..

పండుగలు మన దేశ సాంస్కృతిని కాపాడుతాయన్నారు మోదీ. మన సంప్రదాయం చెడుపై పోరాటం చేస్తుందన్నారు. ఏడాది పొడవునా..ఎదో చోట జరిగే పండగలు భారతీయులను మరింత ఉత్తేజితం చేస్తాయన్నారు. భారత్ రోబోలను రూపొందించకపోయినా.. మానవులను తయారు చేస్తుందన్నారు.

ఢిల్లీలోని నవ్ శ్రీ ధార్మిక్ రామ్ లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ పాల్గొన్నారు. రావణవథను తిలకించారు.

ఎర్రకోట ప్రాంగణంలోని లవ్ కుష్ రామ్ లీలా మైదానంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం కేజ్రివాల్ పాల్గొన్నారు. బాణం వేసి రావణ వధ చేశారు.

జమ్ము కశ్మీర్ లో జరిగిన వేడుకల్లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. చెడుపై మంచి విజయం సాధించిందనే సూచికగా బాణం వేసి రావణ వధ నిర్వహించారు.

ముంబై శివాజీ పార్క్ లో జరిగిన దసరా వేడుకల్లో శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే పాల్గొన్నారు. రామ మందిరం విషయంలో ప్రాణం పోయిన మాట తప్పేది లేదన్నారు.

చంఢీఘఢ్ లో 221 అడుగుల భారీ రావణుడి కటౌట్ ను ఏర్పాటు చేశారు. అనంతరం వేడుకలో భాగంగా రావణ వధ చేశారు. గౌహతిలో 70 అడుగుల కటౌట్ ను తగలబెట్టారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో రావణ వథను ప్లాస్టిక్ వాడకాన్ని వ్యతిరేకిస్తూ సందేశాత్మకంగా నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలతో చేసిన రావణుడి విగ్రహాన్ని దహనం చేశారు.

Next Story

RELATED STORIES