దొంగతనానికి వెళ్లి హెడ్‌మాస్టర్‌ను అతి దారుణంగా..

X
TV5 Telugu9 Oct 2019 10:52 AM GMT
చోరీలకు అలవాటు పడిన ముగ్గురు మైనర్లు దారుణంగా హత్యలు చేసేస్థాయికి ఎదిగారు. దొంగతనానికి వెళ్లి హత్య చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తూరంగిలో సెప్టెంబర్ 14న జరిగిన హత్య కేసులో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగుచూశాయి.
రేపూరు ప్రభుత్వ పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న వెంకట్రావ్ అతిదారుణంగా హత్యకు గురయ్యారు. దీనికి కొన్నిగంటల ముందు వెంకట్రావ్ భార్య హైదరాబాద్ వెళ్లడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. లేదంటే ఆమెను కూడా హత్యచేసి బంగారం దోచుకోవాలన్న నిందితుల స్కెచ్ పోలీసుల విచారణలో తేలింది. ఈ దారుణానికి పాల్పడింది 17 ఏళ్ల మైనర్ బాలుడు కాగా, ఇతనికి 13, 14 ఏళ్ల మరో ఇద్దరు మైనర్లు సహకరించారు. దొంగతనం, హత్యలో మైనర్లకు ఏసురాజు అనే మరో నిందితుడు కూడా సహకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
Next Story