తాజా వార్తలు

సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శృతి హాస‌న్

సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శృతి హాస‌న్
X

క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో ఇటు తెలుగు అటు హిందీలో బిజీగా ఉండేది. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉన్న ఈ అమ్మ‌డు చివరిగా కాట‌మ‌రాయుడు అనే చిత్రం చేసింది. ఇటీవ‌ల హిందీలో బెహెన్ హోగీ తేరీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త‌న తండ్రి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ‌భాష్ నాయుడు చిత్రంలో న‌టించింది. ఆ తరువాత అమ్మడు పీకల్లోతు ప్రేమలో పడింది. ఇటాలియన్‌ బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌ కోర్సలేతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. లాస్‌ ఏంజెల్స్‌, చెన్నై, ముంబై లలో పర్యటించారు. అప్పట్లో ఈ జంటను చూసిన వారంతా ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు.. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ జంట విడిపోయింది. అయితే తాజాగా ఈ విషయాన్నీ స్వయంగా వెల్లడించింది శృతి.. మంచు లక్ష్మి వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఓ రియాలిటీ షోకు హాజరైంది శ్రుతి.

ఈ సందర్భంగా మైఖేల్‌తో బ్రేక్‌ అప్‌, పెళ్లి విషయాలను చెప్పుకొచ్చింది.'నేను చాలా అమాయకంగా ఉంటాను. దాంతో నా చుట్టు ఉన్న వారు నాపై ఆధిపత్యం చెలాయిస్తూ.. బాస్‌లా ప్రవర్తిస్తారు. అంతేకాకుండా నాలో భావోద్వేగాలు ఎక్కువ. అందుకే నా చుట్టు ఉండే వారు నన్ను తమ అధీనంలో ఉంచుకోవాలని భావిస్తారు. అయితే ఇవన్ని కూడా నాకు మంచి అనుభవాలనే మిగిల్చాయి.. ఇక పెళ్లి విషయానికొస్తే.. సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను.. మంచి వ్యక్తి కనబడితే అతనితో ప్రేమలో పడతాను, ప్రేమలో పడటానికి ప్రత్యేకించి ఫార్ములా ఏది పెట్టుకోలేదు.. కొన్ని సమయాల్లో కొందరు గొప్పగా అనిపిస్తారు.. మరికొన్ని విషయాల్లో చెడుగా కనిపిస్తారు ఇలాంటి విషయాల గురించి నేను బాధపడను' అని వెల్లడించింది. కాగా కొద్ది సంవత్సరాల పాటు సాగిన శ్రుతి, మైఖేల్‌ బంధం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసిన సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES