ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు

ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు

ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 15కు హైకోర్టు వాయిదా వేసింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. డిమాండ్లు పరిష్కరించే లోపే కార్మికులు సమ్మెకు వెళ్లారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

సమ్మెపై ఆర్టీసీ కార్మికులు హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. నెల రోజుల ముందే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని కార్మిక జేఏసీ నేతలు హైకోర్టుకు తెలిపారు. సమ్మె సందర్భంగా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పాస్‌లున్నవారికి కూడా టిక్కెట్లు ఇస్తున్నారని కోర్టుకు తెలిపారు పిటిషనర్‌.

Tags

Read MoreRead Less
Next Story