రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు.. 3500 పోస్టులు..

రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు.. 3500 పోస్టులు..
X

ఇప్పటికే రైల్వేలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వచ్చాయి. మరోసారి వాటికి సంబంధించిన వివరాలు నిరుద్యోగ యువతీ యువకులకోసం.. అప్లై చేసుకోని వారు దరఖాస్తుకు ఇంకా సమయం ఉంది. గమనించుకోండి.

1. పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ RRC అసిస్టెంట్ లోకో పైలెట్-ALP, టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 306 ఖాళీలున్నాయి. ఇప్పటికే రైల్వేలో ఉద్యోగం చేస్తున్న వాళ్లు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 12 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ జోన్‌లోనే మరో డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఖాళీలు 149 ఉన్నాయి. ఇవి కూడా రైల్వేలో ఉద్యోగం చేస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన గడువు అక్టోబర్ 15.

2. ఉత్తర రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ NRR 118 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ అక్టోబర్ 15.

3.వెస్ట్రర్న్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టుల్ని ప్రకటించింది. ఇందులో మొత్తం 99 ఖాళీలు ఉన్నాయి. రైల్వేలో పని చేస్తున్నవారికోసం ఈ ఉద్యోగాలను ప్రకటించింది. దరఖాస్తు గడువు అక్టోబర్ 15.

4. వాయువ్య రైల్వేకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం ఖాళీలు 21. గ్రూప్ సీ స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలివి. ఇంటర్ అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 23.

5. దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కోటా ద్వారా గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఖాళీలు 21. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 28.

6. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే NFR భారీగా అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం పోస్టులు 2590. వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్, మెకానికల్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, లైన్‌మెన్, మేసన్, ఫిట్టర్ స్ట్రక్చరల్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటినెన్స్ పోస్టులను భర్తీ చేస్తుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 31.

7.10వ తరగతి పాసైన వారి కోసం పశ్చిమ మధ్య రైల్వే 160 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ నవంబర్ 5.

8. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ KRCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. నేషనల్ అప్రెంటీస్ ట్రైనింగ్ స్కీమ్ NATS కింద ట్రైనీ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తుంది. మొత్తం 135 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు నవంబర్ 18 చివరి తేదీ.

Next Story

RELATED STORIES