దీపావళి బొనాంజా.. పెన్షన్ ఏకంగా రూ.6,000

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను ఒకేసారి 5 శాతం పెంచుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ 17 శాతం వరకు పెరిగింది. దీంతో వారికి ముందుగానే దీపావళి వచ్చినట్టయింది. కేవలం ఉద్యోగులకు మాత్రమే కాకుండా పెన్షనర్లకు కూడా దీని ద్వారా ప్రయోజనం కలగనుంది. 5 శాతం పెంపు నిర్ణయంతో పెన్షనర్లు ప్రతి నెలా తీసుకునే పెన్షన్ మొత్తం రూ.450 నుంచి రూ.6,250 మధ్యలో పెరగనుంది. ఆల్ ఇండియా ఆడిట్ అండ్ అకౌంట్స్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ హరీశ్ శంకర్ తివారీ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పరిశీలిస్తే ఇదే ఎక్కువ మొత్తమని అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి రిటైర్మెంట్ తరువాత నెలకు కనిష్టంగా రూ.9,000 పెన్షన్ లభిస్తుంది. గరిష్టంగా రూ.1.25 లక్షల పెన్షన్ కూడా తీసుకోవచ్చు. డీఏ పెంపు వల్ల దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. జులై 1 నుంచి ఈ పెరిగిన డీఏ లభిస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com