తాజా వార్తలు

ఈఎస్ఐ స్కామ్‌లో మరో ముగ్గురు అరెస్ట్

ఈఎస్ఐ స్కామ్‌లో మరో ముగ్గురు అరెస్ట్
X

సంచలనం సృష్టించిన ESI మెడిసిన్స్ స్కామ్‌లో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి, చర్లపల్లి ఫార్మాసిస్ట్ లావణ్య, వరంగల్ జేడీ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న పాషాను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అవసరం లేకున్నా పెద్ద మొత్తంలో మెడిసిన్స్ కొనుగోలు చేసి.. ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారన్నది వీరిపై ఉన్న ప్రధాన అభియోగం.

ఈ కేసులో ఇప్పటికే ESI డైరెక్టర్ దేవికారాణి సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల్ని రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకొని ప్రశ్నల వర్షం కురిపించారు. మందుల కొనుగోళ్లు, ఫార్మకంపెనీల టెండర్లు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ఈ సమాచారం ఆధారంగా దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. తాజా అరెస్టులతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య పదికి చేరింది.

Next Story

RELATED STORIES