జొమాటో బాయ్ ఎంత పని చేశాడు.. ఫుడ్ డెలివరీ చేసి..

జొమాటో బాయ్ ఎంత పని చేశాడు.. ఫుడ్ డెలివరీ చేసి..

బుజ్జి కుక్క పిల్ల ఎంత ముద్దుగా ఉందో.. ఎవరూ చూడట్లేదు.. కట్టేసి కూడా లేదు.. అటు ఇటూ చూశాడు.. శుభ్రంగా చంకన పెట్టుకుని వెళ్లిపోయాడు.. ఆర్డర్ చేసిన ఫుడ్‌ని కస్టమర్‌కి అందించిన జొమాటో డెలివరీ బాయ్. తన పప్పీ అరుపులు చెవిని తాకట్లేదని పసిగట్టిన ఆ ఇంటి ఓనర్ ఇల్లంతా వెతికింది. ఇంటి చుట్టూ చూసింది. సీసీ కెమెరా ద్వారా అసలు దొంగని కనిపెట్టేసింది.

మహారాష్ట్ర పుణెకు చెందిన వందనా షా మధ్యాహ్నం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. డెలివరీ బాయ్ పుడ్ ప్యాకెట్ ఓనరమ్మకు అందించి వస్తున్నాడు. అంతలో కుక్కపిల్ల కాళ్లకి అడ్డం పడింది. ముద్దుగా బొద్దుగా ఉందని పట్టుకుని వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని గమనించుకున్న వందన తన డొట్టు కుక్కపిల్లని పట్టుకుపోయింది డెలివరీ బాయే అని తెలుసుకుని జొమాటోకు ఫోన్ కొట్టింది. అతడి పేరు తుషార్ అని తెలుసుకుని.. నా కుక్కపిల్ల నాకిచ్చేయి.. నీకు డబ్బు ఎంతకావాలన్నా ఇస్తా అని ప్రాధేయపడింది. అది మీదనుకోలేదు. దాన్ని మా ఊరు పంపించేశాను అని చల్లగా చెప్పాడు తుషార్. మా కుక్కని మాకిచ్చేదాకా వదిలేది లేదంటూ జొమాటో యాజమాన్యానికి కంప్లైంట్ ఇచ్చింది వందన. వెంటనే స్పందించిన యాజమాన్యం.. ఇలాంటి చర్యల్ని క్షమించేది లేదని, అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ సిబ్బందిని పంపించి సమస్యను పరిష్కరిస్తామని వందన కుటుంబానికి భరోసా ఇచ్చింది జొమాటో.

Tags

Read MoreRead Less
Next Story