మహాబలిపురంలో మహా భేటీ.. కొబ్బరిబోండాలు తాగుతూ..

మహాబలిపురంలో మహా భేటీ.. కొబ్బరిబోండాలు తాగుతూ..
X

మహాబలిపురంలో మహా భేటీ ముగిసింది. చెన్నై నుంచి మహాబలిపురం చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఘనంగా స్వాగతం పలికారు ప్రధాని మోదీ. తమిళనాడు సంప్రదాయ వస్త్రాధారణలో ఆకట్టుకున్నారు మోదీ. తెల్ల లుంగీ, తెల్లచొక్కతో మెరిసిపోయారు. అటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కూడా తెల్లచొక్కాలోనే వచ్చారు. పల్లవులు నిర్మించిన వెయ్యేళ్లనాటి కట్టడాలు, చారిత్రకవైభవం, నిర్మాణాల విశిష్టతను జిన్‌పింగ్‌కు వివరించారు మోదీ. సీ షోర్ ఆలయాన్ని మొత్తం తిప్పి చూపించారు. మహాబలిపురం, సీ షోర్ ఆలయం చారిత్రక ప్రాబల్యాన్ని.. ఇద్దరు నేతలూ గుర్తుచేసుకున్నారు. అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం, పంచ పాండవుల రథాలు వంటి చారిత్రక ప్రాంతాలను సందర్శించారు. అనంతరం సీ షోర్ టెంపుల్‌లో సమావేశం అయ్యారు ఇద్దరు నేతలు. వారి వెంట ఇద్దరు అనువాదకులు కూడా ఉన్నారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కొబ్బరిబోండాలు తాగుతూ మాట్లాడుకున్నారు.

Next Story

RELATED STORIES