బావ మీద కన్నేసిన మరదలు.. అక్క సంసారానికే ఎసరు..

మా ఆయన బంగారం. ఇలాంటి భర్త ఎవరికీ ఉండరు. నా పుట్టింటి వాళ్లని ఎంత బాగా చూసుకుంటున్నాడు. నా చెల్లెలు చదువుకుంటానంటే అన్నీ తానై చూసుకుంటున్నాడని ఎంతో సంబరపడింది ఆ ఇల్లాలు. కానీ ఆ చెల్లెలు తన సంసారానికే ఎసరు పెడుతుందని ఊహించలేకపోయింది. భర్తని వల్లో వేసుకుని నాలుగ్గోడల మధ్య చెల్లెలు అతడితో రాసలీలలు సాగించడాన్ని భరించలేకపోయింది భార్య. తన సంసారం నాశనం చేసిన చెల్లెలిని బజారుకు ఈడ్చింది. భర్తని పోలీసులకు పట్టించింది.
మధ్యప్రదేశ్‌లోని మారు మూల గ్రామానికి చెందిన సంగీతకు కొద్ది నెలల క్రితం గ్వాలియర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. పట్టణంలో ఉంటే బాగా చదువుకోవచ్చని పల్లెలో చదువుకుంటున్న తన చెల్లిని కూడా తనతో పాటు అత్తింటికి తీసుకువెళ్లింది. మరదలిని మంచి కాలేజీలో చేర్పించి, ఆమెకు ఏలోటూ లేకుండా చూసుకునేవాడు భర్త. తన చెల్లెలిపై అతడు చూపిస్తున్న కేరింగ్‌కి అక్క మురిసిపోయింది. అందులో చెడును ఊహించలేకపోయింది. బావ ఆఫీసుకు వెళ్లేటప్పుడు మరదలిని కాలేజీకి దించి వెళ్లడం.. ఏ అవసరం ఉన్నా బావతో చనువుగా చెప్పడం చేస్తుండేది మరదలు. ఇంట్లో కూడా అతడికి అవసరమైన వస్తువులన్నీ అందించడం చేస్తుండేది. ఇలా బావా, మరదళ్ల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది.
ఇంత మంచి బావ ఎవరికీ ఉండరని అతడిపై కన్నేసింది మరదలు పిల్ల. అక్క సంసారానికే ఎసరు పెడుతున్నానన్న ఇంగితజ్ఞానం లేకుండా అతడితో చనువుగా ఉండసాగింది. అక్కలేని సమయంలో బావతో సరసాలాడింది. ఆ విషయం అక్కకు తెలియకుండా మేనేజ్ చేసేది. ఇదిలా ఉండగా ఓ రోజు అక్క పనిమీద బయటకు వెళ్లి త్వరగా వచ్చేసింది. ఈలోపు బెడ్‌రూమ్‌లో నుంచి ఏవో మాటలు వినిపిస్తుండడంతో కిటికీలోనుంచి చూసింది. చెల్లెలు, భర్త అసభ్యకరంగా ఉండడాన్ని చూసింది. ఆ దృశ్యాన్ని చూసి కోపంతో రగిలిపోయిన ఆమె చుట్టుపక్కల వారిని పిలిచి వారిద్దరికి దేహశుద్ధి చేసింది. స్ధానికులు కూడా వారు చేసిన చర్యలను అసహ్యించుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com