ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరచిన మట్టిలో మాణిక్యాలు..

X
ఐడియాలు పెద్ద వాళ్లకేనా మాకూ వస్తాయంటున్నారు ఈ మట్టిలో మాణిక్యాలు. చిట్టి బుర్రకు పదునుపెట్టి క్యారమ్స్ ఆడుకోవడానికి మట్టితోనే బోర్డు తయారు చేసుకున్నారు. కాయిన్స్ కోసం సీసా మూతల్ని సేకరించారు. నేనే గెలిచా.. నువ్వు ఓడిపాయావ్ అంటూ సంబరపడిపోతూ ఆడుకోవడం ఆనంద్ మహీంద్రాను కదిలించింది. ఆయన వాట్సాప్ వండర్ బాక్స్‌లోకి వచ్చిన ఓ అద్భుతమైన ఫోటోని అందరి కోసం షేర్ చేశారు. చిన్నారుల క్రియేటివిటీకి ముగ్ధుడైన మహీంద్రా భారత్‌లో ఊహాశక్తికి ఎటువంటి కొదవలేదన్న విషయానికి ఇదే రుజువు అంటూ రాసుకొచ్చారు. ఆలోచన ఉంటే ఆచరణ సాధ్యమే అని ఈ చిన్నారులు నిరూపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

