తాజా వార్తలు

విశాల్-అనీశా రెడ్డిల పెళ్లి ముచ్చట.. !!

విశాల్-అనీశా రెడ్డిల పెళ్లి ముచ్చట.. !!
X

తమిళ హీరో విశాల్.. హీరోయిన్ వరలక్ష్మిలు పెళ్లి చేసుకుంటారనే వార్తలకు తెరదించుతూ హైద్రాబాద్‌కు చెందిన అనీశా రెడ్డితో విశాల్ పెళ్లి నిశ్చయమైంది. వీరిద్దరి నిశ్చితార్థం కూడా పూర్తయింది. అనుకున్న డేట్ ప్రకారం అక్టోబర్ 9న వివాహం జరుగుతుందని ప్రచారం జరిగింది. ఇంతలోనే ఏమైందో చడీ చప్పుడూ లేదు. విశాల్ ఇంట పెళ్లి బాజాలు మోగలేదు. దీంతో పెళ్లి రద్దయిందన్న ఊహాగానాలు వినిపించాయి. ఆ జంట మధ్య నెలకొన్న మనస్పర్థలే ఇందుకు కారణమని వినిపించింది. దానికి తోడు విశాల్ ఫోటోలను అనీశా తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించడంతో ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే విశాల్ తండ్రి, సినీ నిర్మాత కూడా అయిన జీకే రెడ్డి ఆ ప్రచారాన్ని కొట్టి పారేశారు. విశాల్-అనీశాల పెళ్లి జరుగుతుందని, అయితే వివాహ తేదీ ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందులోనే విశాల్ పెళ్లి చేస్తామని చెప్పారు. గురువారం చెన్నైలో దమయంతి చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

Next Story

RELATED STORIES