ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌-ధన్ పెన్షన్ స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా మీకు..

ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌-ధన్ పెన్షన్ స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా మీకు..

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ స్కీమ్‌లో చేరిన వారికి 60 ఏళ్ల తరువాత జీవితాంతం నెలకు రూ.3,000 పెన్షన్ వస్తుంది. స్కీమ్‌లో చేరే వాళ్లు 60 ఏళ్ల వరకు నెలకు కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎంతైతే డబ్బు జమ చేస్తారో అంతే మొత్తం ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఈపీఎఫ్ స్కీమ్ లాంటిదే ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్ పథకం కూడా.

ఈ పథకం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 18 నుంచి 40 ఏళ్ల వయసున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. వారి జీతం నెలకు 15,000ల లోపు ఉండాలి. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి.

ఈ పథకం క్రిందకు వీధుల్లో దుకాణాలు నిర్వహించే వాళ్లు, ఇళ్లలో పనిచేసేవారు, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేవాళ్లు, రిక్షా పుల్లర్లు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు.. వస్తారు.

ఈ పథకంలో చేరాలనుకున్న వారు వారి వయసును బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి జీవితాంతం సగం పెన్షన్ లభిస్తుంది.

ఎల్‌ఐసీ, ఈఎస్‌ఐసీ,ఈపీఎఫ్‌ఓ ఆఫీసులతో పాటు కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయాల్లో ఈ పథకంలో చేరొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story