ఆ రికార్డును తుడిచిపెట్టిన కోహ్లీ..

ఆ రికార్డును తుడిచిపెట్టిన కోహ్లీ..

పూణే టెస్ట్ లో విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. కెరీర్ బెస్ట్ స్ట్రైక్ తో మ్యాచ్ గమనాన్ని శాసించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత్ కెప్టెన్ బ్యాటింగ్ ధాటికి సర్ డాన్ బ్రాడ్ మన్, సచిన్ టెండూల్కర్ , సునీల్ గవాస్కర్, వెన్ సర్కార్, స్టీవ్ స్మిత్ లాంటి క్రికెట్ ప్రముఖుల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. మరికొన్ని రికార్డులు సమం అయ్యాయి.

సింగిల్స్, డుబల్స్ తీస్తూనే అవకాశం దక్కినప్పుడల్లా స్టైలిష్ సర్జికల్ స్ట్రోక్స్..బౌండరీల మోత మొగించాడు కింగ్ కోహ్లీ. తన పరుగుల వేటలో గంటల కొద్ది క్రీజులో పాతుకుపోయిన కోహ్లీ టెస్టులో 26వ శతకం బాదేశాడు. కెప్టెన్ గా 19 సెంచరీలు చేసిన కెప్టెన్ గా పాంటింగ్ రికార్డును బీట్ చేశాడు కోహ్లీ. ఇక గ్రేమ్ స్మిత్ రికార్డ్ అతని టార్గెట్

సెంచరీ తర్వాత మరింత కుదరుకున్న కోహ్లీ..వేగంగా 150 పరుగులు పూర్తి చేశారు. తొమ్మిదో సారి 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక అంతర్జాతీయ క్రికెటర్ గా సర్ డాన్ బ్రాడ్మన్ రికార్డును కోహ్లీ తుడిచి పెట్టాడు. అదే జోష్ లో డబుల్ సెంచరీని కూడా దాటేసిన కోహ్లీ..టీమిండియాలో అత్యధికంగా ఆరు డబుల్ సెంచరీలు సాధించిన సచిన్, సెహ్వాగ్ ను దాటేశాడు.

డుబల్ సెంచరీ దాటినా.. కోహ్లీ పరుగుల వేట ఆగలేదు. 254 పరుగులు సాధించి తన వ్యక్తిగత స్కోరును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఇలా తన అత్యధిక స్కోరును తాను మెర్చుకోవటం ఇది 15వ సారి. ఆటగాడిగా కోహ్లీకి ఇది 69 వ అంతర్జాతీయ శతకం కెప్టెన్గా 50వ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన 4 అంతర్జాతీయ క్రికెటర్ గా కోహ్లీ పేరు రికార్డులకు ఎక్కింది అంతకుముందు స్టీవ్ వా ,స్టీఫెన్ ఫ్లెమింగ్ ,అలెస్టర్ కుక్ మాత్రమే ఈ ఫీట్ సాధించగలిగారు.

ఈ మ్యాచ్ లో భారీ ద్విశతకం సాధించిన కోహ్లీ.. టెస్ట్ క్రికెటర్లలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో 7054 పరుగులు చేసిన కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అత్యధిక పరుగుల రికార్డులను అధిగమించాడు. కెప్టెన్ గా 41 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసిన రికీ పాంటింగ్ రికార్డుకు కోహ్లీ ఒకే ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు.

పూణే లో బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన కెప్టెన్ కోహ్లీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. సచిన్ కెరీర్లో యావరేజ్ 53.78 కాగా కోహ్లీ యావరేజ్ 54 పైగా నమోదైంది. అలాగే కోహ్లీ సారధ్యంలో భారత జట్టు మరొక అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. స్వదేశంలో ఇప్పటికి వరుసగా 10 టెస్ట్ మ్యాచ్ లో సిరీస్ లో ఓటమి ఎరుగని జట్లుగా ఆస్ట్రేలియా, భారత్ నిలిచాయి. అయితే..ఈ టెస్టుల్లో భారత్ టీం నెగ్గితే వరుసగా పదకొండవ విజయాన్ని ముద్దాడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story