తాజా వార్తలు

సంక్రాంతికి సందడే సందడి.. ఎన్ని సినిమాలో తెలుసా?

సంక్రాంతికి సందడే సందడి.. ఎన్ని సినిమాలో తెలుసా?
X

2019 సంక్రాంతికి నాలుగు సినిమాల మధ్య వార్ నడిచింది. ఫైనల్ విన్నర్ గా విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 కాలర్ ఎగరేసింది. సైలెంటు విక్టరీ అది. ఇప్పుడు 2020 సంక్రాంతి వార్ అంతకంటే టఫ్ గా కనిపిస్తోంది. ఈ సారి పోటీ చాలా తీవ్రంగా మారుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తలైవర్ రజనీకాంత్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు సంక్రాంతి పోటీలో ఉన్న సినిమాలు. బాలయ్య, శర్వానంద్ కూడా సంక్రాంతికే వచ్చే అవకాశాలు ఉన్నాయనేది టాక్... అంటే వచ్చే సంక్రాంతికి ఏకంగా ఆరు సినిమాలు పోటీ పడబోతున్నాయి.

సంక్రాంతి పుంజులు ఢీ అంటే ఢీ అన్నట్టే బరిలో దిగుతున్నాయని అర్థమవుతోంది. సంక్రాంతి రేస్ లో ఉన్నాం అంటూ ఇంతకుముందే హింట్ ఇచ్చిన 'సరిలేరు నీకెవ్వ'రు టీమ్.. అల వైకుంఠపురంలో టీమ్ .. ఒకరితో ఒకరు పోటీపడుతూ నువ్వా నేనా అంటూ జనవరి 12న రిలీజ్ తేదీని నిన్ననే కన్ఫామ్ చేశారు. కొద్ది రోజులుగా ఏ డేట్ కి రావాలో అనే ఆలోచనలో ఉన్న మేకర్స్, సడన్ గా నిన్న అఫిషియల్ గా రిలీజ్ డేట్స్ ని ప్రకటించారు. ముందుగా హారికా అండ్ హాసినీ సంస్థ, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న అల వైకంఠపురములో సినిమాకి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయగా, రెండు మూడు గంటల గ్యాప్ లోనే సరిలేరు నీకెవ్వరూ టీమ్ కూడా జనవరి12నే వస్తున్నాం అని ప్రకటించి వార్ కి తెరలేపింది.

సంక్రాంతి సీజన్ ని ముందుగా ఈ సారి రజనీకాంత్ స్టార్ట్ చేయబోతున్నాడు. మురుగదాస్ తో చేస్తున్న దర్బార్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయడానికి కొద్ది రోజుల క్రితమే ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ని దిల్ రాజు, యువి క్రియేషన్స్ కలిసి రిలీజ్ చేయబోతున్నాయి. మురుగదాస్, రజనీ కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రజనీకాంత్ కూడా రోబో సీక్వెల్, పెట్టా చిత్రాలతో సక్సెస్ జోష్ లో ఉన్నాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక 12న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సరిలేరు చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నాడు. రష్మిక హీరోయిన్. విజయశాంతి ఓ కీలక పాత్ర పోషించడం సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్. ఇక అల వైకుంఠపురములో చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. టబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే జనవరి 12 ఆదివారం వచ్చింది. సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆదివారమైనా సరే ఈ ఇద్దరు హీరోలు ఆ డేట్ కే ఫిక్స్ అయ్యారు.

నిజానికి సంక్రాంతి బరిలో దిగే సినిమాల్లో బాలయ్య సినిమా కూడా ఉంది. కానీ కొద్ది రోజులుగా బాలయ్య ఈ సారి సంక్రాంతికి రావడం లేదని, కాస్త ముందుగానే క్రిస్మస్ కి వస్తున్నాడనే టాక్ హల్ చల్ చేస్తోంది. అయితే మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా సంక్రాంతికే వస్తుండటం విశేషం. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మెహ్రీన్ హీరోయిన్. రీసెంట్ గానే టీజర్ వచ్చి ఎట్రాక్ట్ చేసింది. ఈ సినిమాని జనవరి 15న విడుదల చేయడానికి డేట్ లాక్ చేసింది టీమ్.

సంక్రాంతి వార్ కి రెడీ అయిన ఈ సినిమాలన్నింటికి షాక్ ఇస్తున్నాడు వెంకీ మామ. నిన్న మొన్నటి వరకు దీపావళి అని, డిసెంబర్ లో వస్తుందనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు వెంకీమామ కూడా సంక్రాంతికే వచ్చే చాన్స్ ఉందంటున్నారు. వెంకటేష్, నాగచైతన్యల మల్టిస్టారర్ మూవీ ఇది. నిర్మాత సురేష్ బాబు, వెంకీమామ రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరపడం వల్లనే, సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో సినిమాల మేకర్స్ సడన్ గా తమ చిత్రాలకు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశారు. అయితే వెంకీ మామ జనవరి 14 లేదా 15న వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకే సారి మహేష్, అల్లు అల్లు అర్జున్, రజనీకాంత్, వెంకటేష్, కళ్యాణ్ రామ్ ల సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల ధియేటర్ల కొరత రావడం మాత్రం ఖాయం. ఆ ప్రభావం ఓపెనింగ్స్ పై పడుతుంది. మరి వచ్చే సంక్రాంతికి ఈ సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి.

Next Story

RELATED STORIES