తాజా వార్తలు

చికిత్స పొందుతూ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి

చికిత్స పొందుతూ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి
X

ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసించి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఖమ్మం జిల్లాకు చెందిన డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శనివారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేసిన.. శ్రీనివాసరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. అయితే దురదృష్టవశాత్తు అతను ప్రాణాలు విడిచారు. కాగా ఖమ్మంలోని తన ఇంటి వద్దే శ్రీనివాసరెడ్డి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Next Story

RELATED STORIES