యూనియన్లు సమ్మె విరమించి చర్చలకు రావాలి - కేకే

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి చేయిదాటకముందే యూనియన్లు సమ్మె విరమించి చర్చలకు రావాలన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను ఎంతో బాధించాయన్నారు. పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు చర్చలకు రావాలని, ఆర్టీసీ విలీనం తప్ప మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. TRS ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను గతంలో గొప్పగా పరిష్కరించిందని కేకే గుర్తు చేశారు. 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఇటీవలే తేల్చిచెప్పారని దీనిపై ఆందోళన వద్దని అన్నారు. అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజి క్యారేజీల విషయంలో కేసీఆర్ ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని అన్నారు. తాను నేను 2018 అసెంబ్లీ ఎన్నికలకు TRS మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నానని.. ఆర్టీసీ విలీనంపై హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ పాలసీ వ్యవహారమని.. దాంతో ఆర్టీసీ యూనియన్లకు సంబంధం ఉండబోదని కేకే అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com