మా ఆవిడ మరీ మొరటు.. నాకొద్దీ వైఫ్ అంటూ..

మా ఆవిడ మరీ మొరటు.. నాకొద్దీ వైఫ్ అంటూ..
X

షార్ట్స్ వేసుకోవట్లేదు.. మందు షేర్ చేసుకోవట్లేదు.. నాకొద్దీ పాత చింత కాయ పచ్చడి అంటూ భార్యని బయటకు పంపించేశాడు ఈ మోడ్రన్ మహాశయుడు. మూడు సార్లు తలాక్ చెప్పి బయటకు గెంటేశాడు. ట్రిపుల్ తలాక్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా అక్కడక్కడా కొన్ని కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన నూరి ఫాతిమాకు 2015లో ఇమ్రాన్ ముస్తఫా అనే వ్యక్తితో వివాహమైంది. గత కొంత కాలం నుంచి వారు ఢిల్లీలో నివసిస్తున్నారు. పెరిగిన వాతావరణం.. పెంచిన తల్లిదండ్రుల కారణంగా ఫాతిమా మరీ మోడ్రన్‌గా ఉండేది కాదు. అదే ఆమె భర్త ఇమ్రాన్‌కు నచ్చలేదు.

భార్య ఈ కాలం యువతిలా ఉండాలని కోరుకున్నాడు. తను ఆశించినది ఒకటైతే తన జీవితం మరోలా ఉంది. పార్టీలకు వెళ్లినప్పుడు భార్య లేటెస్ట్ దుస్తులు ధరించడం లేదని.. ఇంకా పార్టీలో స్నేహితుల భార్యలంతా మధ్యం సేవిస్తుంటే తన భార్య మాత్రం మందు ముట్టకుండా ముక్కు మూసుకుంటుందని అది తనకు చాలా అవమానకరంగా ఉంటుందని భావించాడు. ఇదే విషయమై భార్యని తరచూ వేధింపులకు గురిచేసేవాడు. భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు తీవ్రస్థాయిలో ఉండేవి. తన మాట విననప్పుడు ఇంట్లో ఉండొద్దని భార్యను బయటకు గెంటేసి త్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఫాతిమా ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కమిషన్ సంజాయిషీ ఇవ్వాలంటూ ఇమ్రాన్‌కు నోటీసులు జారీ చేసింది.

Next Story

RELATED STORIES