ప్రేమించిన ప్రియుడు తనని వదిలి వెళ్లిపోతున్నాడని తెలిసీ..

ప్రేమించిన ప్రియుడు తనని వదిలి వెళ్లిపోతున్నాడని తెలిసీ..

అతడే తన సర్వస్వమనుకుంది.. అన్నీ అర్పించుకుంది. మనసైన వాడినే మనువాడాలనుకుంది. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. ప్రేమించిన ప్రియుడితో జీవితాన్ని పంచుకోవాలనుకున్న ప్రియురాలి ఆశలు అడియాశలయ్యాయి. భ్రిటన్‌లోని పిలేగ్ ప్రాంతానికి చెందిన హారిసన్, లిజ్‌లు టినేజ్ నుంచి ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ అంతలోనే వారి జీవితాల్లో విషాదం చోటు చేసుకుంది. హరిసన్‌కు బ్రెయిన ట్యూమర్ వచ్చింది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. చికిత్స చేయించుకున్నా బతికే అవకాశాలు తక్కువన్నారు డాక్టర్లు.

ఈ వార్త విన్న ప్రేమికులిద్దరూ గుండె పగిలేలా రోదించారు. అంతలోనే లిజీ తమాయించుకుని జీవితాంతం తోడు ఉంటాడనుకున్న హరిసన్ ఉన్నంత కాలమైనా సంతోషంగా ఉంచాలనుకుంది. నువ్వు ఎన్ని రోజులు బతికినా ఆ కొన్ని రోజులైనా నీతో కలిసి ఉంటాను. నా జీవితం చివరి వరకు నీ జ్ఞాపకాల్లో బతికేస్తాను అంటూ అతడిని వివాహం చేసుకుంటాను ఏర్పాట్లు చేయమంది హరిసన్ కుటుంబసభ్యులతో. హరిసన్ ఇంట్లో వారితో పాటు అతడు కూడా వారించాడు. రాలిపోయే పువ్వుకు రాగాలెందుకన్నాడు.

అయినా లిజీ వినలేదు. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో లిజీ, హరిసన్‌ల నిశ్చితార్థం జరిగింది. వారం రోజుల్లో పెళ్లి డేట్ పెట్టుకున్నారు. కానీ పెళ్లికి కావలసిన డబ్బు లేదు. హరిసన్ వైద్యం కోసం చాలా ఖర్చయింది. అయినా లిజీ నిరాశ చెందలేదు. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు అన్నీ తామై విరాళాలు సేకరించి లిజీ, హరిసన్‌ల పెళ్లి ఘనంగా నిర్వహించారు. వీరి పెళ్లి వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హరిసన్ కోలుకోవాలంటూ నెటిజన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story