తాజా వార్తలు

మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడు

మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడు
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. తల్లి కూలి పని కోసం వెళ్లినప్పుడు.. ఇంట్లో ఉన్న ఏడేళ్ల బాలికపై.. పక్కింటి యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని.. పైశాచికత్వం ప్రదర్శించాడు. బాలిక ఏడుస్తుండడంతో గ్రామస్తులు విషయం అడిగారు. ఆ వెంటనే.. చిన్నారి తల్లికి సమాచారం ఇచ్చారు. కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.

బాధితురాలి తల్లి అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. నిందితుడిపై ఫోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Next Story

RELATED STORIES