భారీ వర్షాలు.. 33మంది మృతి

భారీ వర్షాలు.. 33మంది మృతి

జపాన్‌ను భారీ టైఫూన్ వణికిస్తోంది. హగిబీస్ ప్రభావం కారణంగా ఇప్పటివరకు 33మంది మంది మరణించారు. మరో 15మంది గల్లంతయ్యారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి అధికనష్టం వాటిల్లింది. చికుమా నది ఉధృతంగా పొంగిపొర్లడంతో సెంట్రల్ జపాన్ లోని నాగావో ప్రాంతం నీటమునిగింది. భారీ వర్షాల కారణంగా రవాణ, విద్యుత్ వ్యవస్థ స్థంభించిపోయాయి. రైళ్లు, విమానాల సర్వీసులను అధికారులు రద్దచేశారు. వర్షం కారణంగా నమీబియా- కెనడా దేశాలమధ్య జరుగాల్సిన రగ్బీ వరల్డ్ కప్ మూడో టోర్నమెంట్ మ్యాచ్ రద్దైంది. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు మిలటరీ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. ప్రజలను కాపాడేందు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుందని జపాన్ ప్రధాని షింజో అబే తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story