శిక్షణ పొందుతున్న సూసైడ్‌ బాంబర్లు.. భారత్‌లో మరో ఉగ్రదాడికి భారీ పన్నాగం ?

శిక్షణ పొందుతున్న సూసైడ్‌ బాంబర్లు.. భారత్‌లో మరో ఉగ్రదాడికి భారీ పన్నాగం ?

భారత్‌లో మరో ఉగ్రదాడికి భారీ పన్నాగం పన్నినట్టు భద్రతాదళాలు గుర్తించాయి. కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్టు అనుమానాలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్‌లోని బాల్‌కోట్‌లో ఇప్పటికే ఉగ్రకార్యకలాపాలు మొదలైనట్టు తెలుస్తోంది. సుమారు 45 నుంచి 50 మంది జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని హోంశాఖకు సమాచారం అందింది. వారిలో సూసైడ్‌ బాంబర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

భారత్‌లో రక్త పాతం సృష్టించేందుకు మళ్లీ ఉగ్రమూకలు సిద్ధమవుతున్నాయి. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఇప్పటికే ఉగ్ర కార్యకలాపాలు మొదలైనట్టు నిఘా వర్గాలకు ఇటీవల సమాచారం అందింది. దాదాపు 45 నుంచి 50 మంది జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తోంది. అందులో సూసైడ్‌ బాంబర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్‌ కుట్రలు మొదలయ్యాయని.. దానిలో భాగంగానే బాలోకోట్‌లో ఉగ్ర శిబిరాలు తెరుచుకున్నాయని అనుమానిస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతోనే కశ్మీర్‌లో హింస చెలరేగిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్తాన్‌ ఈ ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కశ్మీర్‌లో దాడులకు పాల్పడేందుకు జైషే ఉగ్రవాదులు రెక్కీ కూడా నిర్వహించారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. అయితే, ఉగ్రమూకల్ని ఎదుర్కోవడానికి ఆర్మీ సిద్ధంగా ఉందని, వారికి ఎలాంటి అడ్డంకులు లేవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసమయ్యాయి. దీంతో ఆరు నెలలుగా అక్కడ మానవ సంచారం తగ్గిపోయింది.

370 ఆర్టికల్‌ రద్దు తరువాత నుంచి భారత్‌పై విషం కక్కుతున్న పాకిస్థాన్‌ ప్రోత్సాహంతోనే బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలను మళ్లీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మంచు కరుగుతున్న ప్రాంతాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తర భాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మారవచ్చుననీ భారత భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.

ఇప్పటికే జార్ఖాండ్, బిహార్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో జేఎంబీ కార్యకలాపాలు పెరిగినట్టు గుర్తించామని, అనుమానిత ఉగ్రవాదుల పేర్లను సంబంధిత ఏజెన్సీల దృష్టికి తీసుకు వెళ్తున్నామని ఎన్ఐఏ డీజీ యోగేష్ చందర్ మోదీ తెలిపారు. ఏటీఎస్,ఎస్‌టీఎఫ్ చీఫ్‌లకు ముందుగానే ఆయన హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story