గతుకుల రోడ్లను హేమా మాలిని బుగ్గల్లా మారుస్తా.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

గతుకుల రోడ్లను హేమా మాలిని బుగ్గల్లా మారుస్తా.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

వర్ణించడానికి కూడా వాఖ్య నిర్మాణం తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఏది పడితే అది మాట్లాడేయొచ్చు అనుకున్నారేమో సదరు మంత్రిగారు నోటికొచ్చినట్లు మాట్లాడి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు బాలీవుడ్ అలనాటి అందాల నటి హేమామాలిని అంటే ఇష్టమేమో. ఆమె బుగ్గలనే టార్గెట్ చేశారు. మధ్యప్రదేశ్ మంత్రి పీసీ శర్మ రాష్ట్రంలోని రోడ్లను బీజేపీ ఎంపీ కూడా అయిన నటి హేమామాలిని బుగ్గల్లా తయారు చేస్తానన్నారు. భోపాల్ నగరంలోని హబీబ్ గంజ్ ప్రాంతంలో రోడ్లను తనిఖీ చేసిన మంత్రి శర్మ ఈ విధంగా వ్యాఖ్యలు చేసి స్థానికుల చేతిలో విమర్శలను ఎదుర్కున్నారు. ఇంతకు ముందు ఇక్కడి రోడ్లను వాషింగ్టన్ రోడ్ల మాదిరిగానే నిర్మించారని.. కానీ ప్రస్తుతం ఆ రోడ్లకు గుంతలు పడి మశూచి మరకలుగా మారాయన్నారు.

భారీ వర్షం కురిస్తే రోడ్లు రూపు రేఖలు లేకుండా పోతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆదేశాల మేరకు 15 రోజుల్లో రోడ్లకు మరమ్మతులు చేపట్టి హేమామాలిని బుగ్గల్లా తయారు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. స్థానికులు మాత్రం.. మీ మాటలకేం గానీ గుంతల్లో పడి జనం చావక ముందే ఏదో ఒకటి చేయండి అని మొత్తుకుంటున్నారు. ఒక్క రోజు గట్టిగా వర్షం పడితే కొట్టుకు పోయే రోడ్లు వేస్తూ హేమామాలిని బుగ్గల్లా వేస్తామంటూ ప్రగల్భాలు పలికే నాయకులు మాటలు చాలించి పనులు చేయండి అంటూ మంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story

RELATED STORIES