పూరీతో రమ్య రొమాంటిక్..

పూరీతో రమ్య రొమాంటిక్..
X

అందాల తార రమ్యకృష్ణ దాదాపుగా అందరి హీరోలతో ఆడి పాడింది. వరుస సినిమాలు చేస్తూ తన సత్తాను చాటుతోంది. రమ్యకృష్ణ స్థాయిని మరింత పెంచిన చిత్రం బాహుబలి. అందులో ఆమె శివగామిగా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రమ్య ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ నిర్మాణంలో రూపొందుతున్న 'రొమాంటిక్' చిత్రంలో నటించనున్నారు. పూరీ కుమారుడు ఆకాష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అనిల్ పాడూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా కేతికా శర్మ నటిస్తోంది. ఆకాష్ పూరీ కథానాయకుడిగా ఇంతకుముందు ఆంధ్రాపోరీ, మెహబూబా చిత్రాల్లో నటించారు.

Next Story

RELATED STORIES