ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉంటే రూ.20 లక్షల వరకు..

ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉంటే రూ.20 లక్షల వరకు..

క్రెడిట్ కార్డుల మాదిరిగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డెబిట్ కార్డులపై కూడా ఇన్సూరెన్స్ సేవలు పొందవచ్చు. దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ డెబిట్ కార్డు యూజర్లకు ఉచిత ఇన్సూరెన్స్ అందిస్తోంది. పర్సనల్ యాక్సిడెంటల్ (ఎయిర్), పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (నాన్ ఎయిర్) బ్యాగేజ్ లాస్ కవర్, పర్చేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్, యాడ్ ఆన్ కవర్స్ వంటి సదుపాయాలు కల్పిస్తోంది. వీటి ద్వారా దాదాపు రూ.20 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజీ పొందొచ్చు. ఎస్బీఐ గోల్డ్ నుంచి బిజినెస్ కార్డు వరకు, మాస్టర్ కార్డు నుంచి వీసా కార్డు వరకు ప్రతి కార్డుకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉన్న కస్టమర్లు ఊహించని పరిస్థితుల్లో విమానంలో ప్రయాణించేటప్పుడు మరణిస్తే యాక్సిడెంట్ డెత్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే గత 90 రోజుల్లో డెబిట్ కార్డుని ఉపయోగించి ఉండాలి.

అలాగే నాన్ ఎయిర్ యాక్సిడెంట్ కవరేజీకి కూడా పై నిబంధనలు వర్తిస్తాయి.

డెబిట్ కార్డు హోల్డర్ల ఖరీదైన వస్తువులు ఎవరైనా దొంగిలిస్తే అది కూడా ఇన్సూరెన్స్ కవరేజీ కింద వస్తుంది. అయితే ఆ వస్తువు కొనుగోలు చేసిన 90 రోజుల వరకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది. మరో ముఖ్య విషయం టికెట్ బుక్ చేసుకున్నా, వస్తువు కొనుగోలు చేసినా ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా జరిపితేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుందనే విషయాన్నికస్టమర్లు గుర్తుపెట్టుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story