సింహానికే సవాలు.. అలాంటివారే మనిషా, జంతువా అని పట్టించుకోరట..

సింహానికే సవాలు.. అలాంటివారే మనిషా, జంతువా అని పట్టించుకోరట..

ఢిల్లీ జూలోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దూకడం కలకలం రేగింది. మెటల్‌ గ్రిల్స్‌ దాటి ఆ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. కొన్ని నిమిషాల పాటు అతను సింహంతో పరాచకాలు ఆడాడు.. అయితే అదృష్టవశాత్తు అతనికి ఏమి కాలేదు. బిహార్‌కు చెందిన 28 ఏళ్ల రెహన్ ఖాన్‌ గురువారం ఢిల్లీ ఓ జూ కు వెళ్ళాడు. వెళ్లినవాడు తన మానాన తాను ఉన్నాడా అంతే లేదు. ఎవరు లేని సమయం చూసి సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న భారీ సింహం ముందు కూర్చుని దానితో సంభాషించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బయటినుంచి సందర్శకులు అరుస్తూనే ఉన్నా అతను మాత్రం సింహంతో మాట్లాడుతున్నాడు, అంతేకాదు నువ్వు నన్ను ఏం చేయలేవంటూ సింహానికే సవాలు విసిరాడు. అయితే అతను మాట్లాడుతున్న సమయంలోనే ఆ సింహం అతని మీదకు దూకేందుకు ప్రయత్నించింది. అయినా అతను ఏ మాత్రం భయం లేకుండా అక్కడే ఉన్నాడు. దీంతో అప్రమత్తమైన జూ సిబ్బంది అతన్ని చాకచక్యంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లనే ఇలా చేశాడని అధికారులు భావిస్తున్నారు.

ఇటువంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. హైదరాబాద్ లో నెహ్రు జూలాజికల్ పార్క్ లో కూడా ఓ వ్యక్తి ఇలాగే చేశాడు. అయితే అతనికి మానసిక స్థితి సరిగానే ఉంది. వాస్తవానికి ఇటువంటి విన్యాసాలు విదేశాల్లో కామన్ గానే జరుగుతుంటాయి. కొంతమంది జంతు ప్రేమికులు ఎటువంటి భయానక జంతువునైనా లొంగదీసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పయిన దాఖలాలు కూడా ఉన్నాయి. సింహాలు, పులుల దగ్గరికి వెళ్లాలనుకునే వ్యక్తులకు కేవలం మానసిక స్థితి సరిగా లేకపోవడమే కారణం కాదని మానసిక నిపుణులు అంటున్నారు. అటువంటి వారు తమకన్నా ఒక జంతువు గొప్ప ఏంటని అనుకుంటారట.. ఇంకా ప్రజల దృష్టిలో తాను అత్యంత దైర్యవంతుడిని అన్న ప్రాపకం కోసం కూడా ఇలా చేస్తుంటారట.. అలాంటి వారు ప్రాణాలను సైతం లెక్కచేయరని ఎదుట ఉంది.. మనిషా.. జంతువా అని పట్టించుకోరని అభిప్రాయపడుతున్నారు. ఏది.. ఏమైనా క్రూర జంతువుల మానసిక స్థితి కూడా అంచనా వేయటం కష్టమని వారు స్పష్టం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story