రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్.. పాపకు రూ.15000లు..

రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్.. పాపకు రూ.15000లు..
X

కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆడ పిల్లల కోసం వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశ పెడుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆడ పిల్లల కోసం ఓ కొత్త స్కీమ్‌ను లాంచ్ చేయబోతున్నారు. అక్టోబర్ 25న కన్యా సుమంగళ యోజన స్కీమ్‌ను లాంచ్ చేయనుంది. ఈ పథకం కింద ఆరు విడతల్లో ఆడ పిల్లలకు మొత్తంగా రూ.15000 అందిస్తారు. రూ.3 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు ఆడపిల్లలకూ ఈ పథకం వర్తిస్తుంది. పాప పుట్టినప్పుడు 2వేలు, వాక్సినేషన్ తరువాత వెయ్యి రూపాయలు, ఫస్ట్ క్లాస్‌లో చేరినప్పుడు 2వేలు, 6వ తరగతిలో చేరినప్పుడు 2వేలు, 9వ తరగతిలో చేరినప్పుడు 3వేలు, ఇంటర్ అయిపోయిన తరువాత 5వేలు అందిస్తారు. అర్హులైన వారు mksy.up.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం యోగి ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1200 కోట్లు కేటాయించింది.

Next Story

RELATED STORIES