7వ తరగతి చదివి.. వైద్యుడిగా బిల్డప్ ఇస్తూ..

విజయవాడలో నాటువైద్యుడు భూమేశ్వర్రావును అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటీవలే వైద్యం పేరుతో బాలుడి మృతికి కారణమైన అతన్ని కటకటాల్లోకి నెట్టి.. ఈ నకిలీ వైద్యంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. 7వ తరగతి వరకూ చదిరిన భూమేశ్వర్రావు వైద్యుడిగా బిల్డప్ ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు తేల్చడమే కాదు.. అనేక మోసాలకు కూడా పాల్పడినట్టు నిర్థారించారు. గతంలో తల్లిదగ్గర నాటువైద్యం సహాయకుడిగా పనిచేసిన ఈ కేటుగాడు.. తల్లి మరణం తర్వాత తానే వైద్యుడిగా అవతారం ఎత్తాడని పోలీసులు చెప్తున్నారు. బుద్ధిమాంద్యానికి చికిత్స చేస్తానంటూ ప్రకటనలు ఇచ్చి.. ఆయుర్వేదిక్ వాట్సప్ గ్రూప్‌ల్లోనూ, ఏజెంట్ల ద్వారా ప్రచారం చేసుకున్నాడని వివరించారు.
బుద్దిమాంద్యానికి చికిత్స పేరుతో భూమేశ్వర్రావు ఇస్తున్న బిల్డప్ నిజమని నమ్మి.. బెంగళూరు, బళ్లారి, తెలంగాణ, కడప ప్రాంతాలకు చెందిన 11 మంది బాధితులు ఇటీవల విజయవాడ వచ్చారు. గవర్నర్‌పేటలోని గంగోత్రి లాడ్జిలో 3 గదులు అద్దెకు తీసుకున్న నాటువైద్యుడు.. నాలుగు రోజులుగా వారికి వైద్యం చేశాడు. ఈ క్రమంలో వైద్యం వికటించి హరనాథ్ అనే బాలుడు మృతి చెందాడు. విషయం తెలిసి పోలీసులు రంగంలోకి దిగితే.. మొత్తం వ్యవహారం బయటపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com