నిద్రపోతున్న కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన..

X
TV5 Telugu18 Oct 2019 7:24 AM GMT
ఇద్దరు అన్నదమ్ముల మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర ఘర్షణ జరిగింది. కోపంతో ఊగిపోయిన పెద్ద అన్నయ్య అర్థరాత్రి పక్కనే ఉన్న తమ్ముడి ఇంటికి వెళ్లాడు. నిద్రపోతున్న పదహారేళ్ల తమ్ముడి కొడుకు రాకేష్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలుడు కేకలు వేయడంతో కొండయ్య అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా ఈపూరు మండలం కూచినపల్లి గ్రామంలో జరిగింది.
కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి రాకేష్‌ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి శరీరం సగానికిపైగా కాలిపోయింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story