తాజా వార్తలు

ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి వస్తుండగా కాలువలోకి దూసుకెళ్లిన కారు

ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి వస్తుండగా కాలువలోకి దూసుకెళ్లిన కారు
X

స్నేహితుని వివాహానికి హాజరై ఆనందంగా గడిపారు. మధుర జ్ఞాపకాలతో తిరుగు ప్రయాణం అయ్యారు. అంతలోనే వారిని మృత్యువు వెంటాడింది. రెప్పతెరిచి చూసే లోపే ప్రమాదం జరిగిపోయింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద ఇన్నోవా వాహనం అదుపు తప్పి నాగర్జునా సాగర్‌ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. కారుతోపాటు ఐదుగురు వ్యక్తులు కెనాల్‌లో కొట్టుకుపోయారు. గల్లంతైన వారంతా సికింద్రాబాద్‌కు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

అంబులెన్స్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న విమలకొండ మహేశ్‌ వివాహానికి ఆయన స్నేహితులు.. హైదరాబాద్‌ ఈసీఎల్‌లోని అంకూర్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న 11 మంది రెండు కార్లలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఒక కారు కాలువలోకి దూసుకెళ్లింది. రోడ్డుపై గుంతలను తప్పించబోయే సమయంలో కారు అదుపుతప్పి కెనాల్‌లోకి దూసుకుపోయింది. వెంటనే పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. కాల్వలో 18 అడుగుల లోతు ఉండడం, నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

నీటిలో గల్లంతైన వారిలో అబ్దుల్‌, రాజేశ్‌, సంతోష్‌, జాన్సన్‌, నరేశ్‌, పవన్‌ ఉన్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Next Story

RELATED STORIES