స్టెప్పులతో ఫ్యాన్స్‌‌ను ఫిదా చేసిన అసదుద్దీన్ ఓవైసీ

స్టెప్పులతో ఫ్యాన్స్‌‌ను ఫిదా చేసిన అసదుద్దీన్ ఓవైసీ
X

మహారాష్ట్రలో బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్న ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచింది. ఔరంగాబాద్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన అసదుద్దీన్ ఓవైసీ.. వేదికపై మాట్లాడిన తర్వాత స్టేజ్ దిగుతూ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. కొన్ని సెకన్లపాటు స్టెప్పులేస్తూ పార్టీ కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. ఎప్పుడూ సీరియస్‌ ప్రసంగాలతో కనిపించే అసద్‌.. ఇలా డాన్స్ చేసే సరికి ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో MIM 44 చోట్ల పోటీ చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంలో భాగంగా ఓవైసీ అక్కడికి వెళ్లారు. ఔరంగాబాద్ సభలో స్టెప్పులతో ఫ్యాన్స్‌‌ను ఫిదా చేశారు.

Next Story

RELATED STORIES