విద్యార్థులకు టీచర్ల సవాల్.. తీవ్ర వివాదాస్పదం..

విద్యార్థులకు టీచర్ల సవాల్.. తీవ్ర వివాదాస్పదం..

మాల్‌ ప్రాక్టీస్‌ను అడ్డుకునేందుకు కర్నాటక హవేరిలోని భగత్‌ ప్రీ యూనివర్సిటీ తీసుకున్న ఓ తలతిక్క నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.. అసలు విద్యార్థులు తలలు తిప్పి, పక్కవాళ్ల పేపర్లను చూస్తేనే కదా మాస్ కాపీయింగ్ జరిగేది అనుకున్నారు. తలలు తిప్పకుండా ఒకరినొకరు చూడకుండా చేసేందుకు..ఇదిగో ఇలా ఓ చెత్త నిర్ణయాన్ని అమలుపరిచారు. ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ తలలకి అట్టపెట్టలు పెట్టారు. కేవలం పరీక్ష పేపరు మీదే చూపు ఉండే విధంగా అట్టపెట్టెకు ఒకవైపు హోల్ చేశారు.

కర్నాటకలోని భగత్ కాలేజీలో జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాలేజ్‌లోని విద్యార్థులకు మిడ్‌టర్మ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఆక్టోబర్ 16న జరిగిన ఎగ్జామ్స్‌కు హజరైన స్టూడెంట్స్‌కు ఇలా అట్టపెట్టెలు ఇచ్చారు. వాటిని తలలపై అట్టపెట్టుకుని పరీక్షలు రాయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఇదేదో గొప్పపని అన్నట్లు కొందరు టీచర్లు విద్యార్థుల ఫోటోలు తీసి కాలేజ్ వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు..అవికాస్త బయటికి రావడంతో వివాదాస్పదమయ్యాయి. ఈ చెత్త నిర్ణయంపై తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊపిరి ఆడక కొందరు విద్యార్థులు బ్బందులు పడ్డారని.. ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యతని నిలదీశారు..

అట్టపెట్టలు పెట్టి పరీక్ష రాయించడంపై కర్నాటక విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు..యూనివర్శీటి డిప్యూటి డైరక్టర్ నేరుగా వెళ్లి పరీక్ష సెంటర్‌ను పరీశీలించారు. దీనిపై కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ఇలా ప్రయోగం చేశామని చెప్పడంతో ఆ అధికారి షాక్ తిన్నాడు. ఈ సంఘటనపై వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story